Andhra Pradesh: ఏపీలోని 175 స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి

  • జీరో నుంచి అనేక రాష్ట్రాల్లో అధికార పీఠం సాధించాం
  • ఏపీలో కూడా 2019లో అధికారంలోకొస్తాం
  • ప్రత్యేక హోదాపై పార్లమెంట్ లో మేము హామీ ఇవ్వలేదు

ఏపీలో వచ్చే ఎన్నికలలో 175 స్థానాల్లోనూ తమ పార్టీ  ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మురళీధరన్ తెలిపారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, జీరో నుంచి అనేక రాష్ట్రాల్లో అధికార పీఠం సాధించామని, అదేవిధంగా, ఏపీలో కూడా 2019లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఈ అంశంపై పార్లమెంట్ లో తాము హామీ ఇవ్వలేదని అన్నారు.

  • Loading...

More Telugu News