Chandrababu: ‘దమ్ముందా.. అసెంబ్లీ రద్దు చేస్తారా?: ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ బహిరంగ సవాల్
- ‘తెలంగాణ’లా ముందస్తుకు రండి
- గెలుపు కోసం అవకాశవాద పొత్తులు తగదు
- ఫిరాయింపుదారులపై వేటేసిన మర్నాడే అసెంబ్లీ కొస్తాం
ఏపీ సీఎం చంద్రబాబుకు వైసీపీ బహిరంగ సవాల్ విసిరింది. ‘దమ్ముందా.. అసెంబ్లీ రద్దు చేస్తారా? మీరు గెలుస్తారని నమ్మితే.. ‘‘తెలంగాణ’లా ముందస్తుకు రండి. పార్టీ అధికారం కోసం ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచారు. గెలుపు కోసం ప్రతి ఎన్నికలలో అవకాశవాద పొత్తులు పెట్టుకుంటున్నారు.
నైతిక విలువలతో ఒంటరిగా ఒక్క ఎన్నికనైనా చంద్రబాబు గెలిచారా? బీజేపీతో పొత్తు పెట్టుకుని 1999లో గెలిచారు. 2009లో మహాకూటమి అంటూ టీఆర్ఎస్ తోనే పొత్తు పెట్టుకున్నారు. 2014లో బీజేపీ, ‘జనసేన’తో పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు. ముందు 22 మంది ఫిరాయింపుదారులపై వేటు వేయండి. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మంత్రి వర్గంలో ఉన్న నలుగురిని డిస్మిస్ చేయండి. ఫిరాయింపుదారులపై వేటు వేసిన మర్నాడే అసెంబ్లీకి వస్తాం’ అని వైసీపీ పేర్కొంది.