TRS: టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కేకే
- ఎన్నికల మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు
- కమిటీలో సభ్యులుగా జితేందర్ రెడ్డి, ఈటల తదితరులు
- ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన
టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు (కేకే) అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల మేనిఫెస్టో కమిటీ వివరాలను వెల్లడించారు. ఇప్పటివరకు చేసింది, చేయబోయేవి అన్నీ మేనిఫెస్టోలో చెబుతాం అని అన్నారు.
ఎన్నికల మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా కే కేశవరావును నియమించారు. ఇంకా ఈ కమిటీలో సభ్యులుగా జితేందర్ రెడ్డి, జి.నగేష్, ఈటల రాజేందర్, టి.హరీష్ రావు, జి.జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్, అజ్మీర చందూలాల్, కొప్పుల ఈశ్వర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఫరీదుద్దీన్, పి.రాములు, గుండు సుధారాణి ఉన్నారు.