kcr: టీఆర్ఎస్ లో సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయి: పొన్నం

  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం
  • మెజారిటీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంటుంది
  • సీఎం అభ్యర్థి ఎవరో టీఆర్ఎస్ చెప్పగలదా?

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలంటూ కేబినెట్ చేసిన తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్ ఆమోదించారు. దీంతో, రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వేడి మొదలయింది. మరోవైపు, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ తెలిపారు.

టీఆర్ఎస్ లో అప్పుడే సీఎం కుర్చీ కోసం కుమ్ములాటలు మొదలయ్యాయని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పగలరా? అంటూ టీఆర్ఎస్ కు ఆయన సవాల్ విసిరారు. గత ఎన్నికల సమయంలో హుస్నాబాద్ కు ఇచ్చిన హామీలను కేసీఆర్ నెరవేర్చలేకపోయారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ దేనని... మెజారిటీకి అవసరమయ్యే సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News