venkatesh: వెంకటేశ్ .. దుల్కర్ హీరోలుగా మల్టీస్టారర్

  • 'ఎఫ్ 2' మూవీ చేస్తోన్న వెంకటేశ్ 
  • 'జోయా ఫ్యాక్టర్'తో బిజీగా దుల్కర్ 
  • త్వరలో ఈ కాంబినేషన్లో మూవీ      

తెలుగులో ఒక వైపున బయోపిక్ ల హవా కొనసాగుతూ ఉంటే, మరో వైపున మల్టీ స్టారర్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే మరో మల్టీస్టారర్ మూవీకి సన్నాహాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో ఒక హీరోగా వెంకటేశ్ .. మరో హీరోగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ చేయనున్నట్టుగా చెబుతున్నారు. వార్ డ్రామాగా ఈ సినిమా రూపొందనుంది. ఆల్రెడీ దర్శక నిర్మాతలు ఈ ఇద్దరినీ కలిసి కథ చెప్పడం .. వాళ్ల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగిపోయిందని అంటున్నారు.ప్రస్తుతం వెంకటేశ్ .. అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన చేయనున్న ప్రాజెక్టు దుల్కర్ తో మల్టీ స్టారర్ అని అంటున్నారు. దుల్కర్ కూడా హిందీలో 'జోయా ఫ్యాక్టర్' మూవీ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగు పూర్తికాగానే ఆయన మల్టీస్టారర్ మూవీ షూటింగుకి షిఫ్ట్ కానున్నాడని అంటున్నారు.      

More Telugu News