kcr: తెలంగాణ ప్రజల మనోభావాలను బీజేపీకి ఎందుకు తాకట్టుపెట్టారు?: కేసీఆర్ పై విరుచుకుపడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • ప్రజాస్వామ్య విలువలను అణచివేసేందుకు యత్నం 
  • విశ్వవిద్యాలయ విద్యార్థులపై కఠినంగా ప్రవర్తిస్తోంది
  • ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారు 

బీజేపీకి తెలంగాణ ప్రజల మనోభావాలను ఎందుకు తాకట్టుపెట్టారని సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విరుచుకుపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తమ్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని, ప్రజాస్వామ్య విలువలను అణచివేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని, విశ్వవిద్యాలయ విద్యార్థుల పట్ల కఠినంగా ప్రవర్తిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల భర్తీ పూర్తిగా నిలిచిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గ్రూప్-1 నోటిఫికేషన్ వెలువడలేదని, గ్రూప్-2 ఉద్యోగాల భర్తీ నేటికీ పూర్తి చేయలేదని, జాబ్ క్యాలెండర్ ప్రకటించమని అడిగితే ఇప్పటివరకు స్పందనలేదని దుయ్యబట్టారు. తెలంగాణలోని ప్రైవేట్ ఇండస్ట్రీస్ లో అనేక పరిశ్రమలను మూసివేశారని, మూసివేయబడిన పరిశ్రమలను తిరిగి తెరిపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని విమర్శించారు. ప్రైవేటు రంగంలో అధిక ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, టీఎస్పీఎస్సీలో సుమారు 19 లక్షల మంది ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, ఐటీఐఆర్ ద్వారా అధిక ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.

More Telugu News