kongara kalan: అందర్నీ ఆకర్షిస్తున్న కొంగరకలాన్ సభ ప్రత్యేకతలు ఇవి!

  • కిలో మీటర్ దూరం నుంచీ కనబడేలా భారీ సభావేదిక
  • సభా వేదికపై 600 మంది ఆసీనులు కావచ్చు
  • సభా కార్యక్రమాలు తిలకించేందుకు 50 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు

టీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈరోజు నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు పలు ప్రత్యేకతలు ఉన్నాయి. కొంగరకలాన్ లో జరుగుతున్న ఈ సభకు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు తరలివస్తున్నారు. మరికొన్ని గంటలలో ప్రారంభం కానున్న ఈ సభ ప్రత్యేకతల గురించి చెప్పాలంటే..

- ఈ సభా వేదికపై దాదాపు 600 మంది ఆసీనులు కావచ్చు
- నిరంతర పర్యవేక్షణ నిమిత్తం 300 సీసీ కెమెరాలు
- కిలో మీటర్ దూరం నుంచి కూడా కనబడే భారీ సభావేదిక
- వేదిక ముందు 16 గ్యాలరీలు
- సభా కార్యక్రమాలను వీక్షించేందుకు 50 భారీ ఎల్ఈడీ స్క్రీన్లు
- అత్యవసర సేవల నిమిత్తం అంబులెన్స్ లు, మెడికల్ క్యాంపులు
- ప్రతి పార్కింగ్ ప్రాంతంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు
- ట్రాక్టర్ల కోసం భారీ పార్కింగ్ స్థలాలు
- ఇతర వాహనాల కోసం 15 పార్కింగ్ స్థలాలు
- వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ స్థలాలు
- సభకు వచ్చే దారిలో ఆగిపోయిన వాహనాల తరలింపునకు ప్రత్యేక క్రేన్స్
- ప్రధాన వేదిక వెనుక హెలిప్యాడ్

More Telugu News