kongarakalan: ప్రగతి నివేదన సభ.. నోరూరిస్తున్న ‘దేవరకొండ‘ జొన్నరొట్టెలు!

  • వందలాది రొట్టెలు తయారు చేస్తున్న తండా మహిళలు
  • జొన్నరొట్టె, కారం, ఉల్లిగడ్డ, పచ్చి మిర్చి రుచే వేరు
  • ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది గిరిజనులు?  

ప్రగతి నివేదన సభా ప్రాంగణంలో ‘దేవరకొండ‘ జొన్నరొట్టెలను తయారు చేస్తున్నారు. వందలాది రొట్టెలను ఇక్కడ తయారు చేసి తమ నియోజకవర్గం నుంచి వచ్చే కార్యకర్తలకు, మిగిలిన వారికి ఇచ్చేందుకు వాటిని సిద్ధం చేస్తున్నారు. తండాలకు చెందిన మహిళలు ఈ రొట్టెలను తయారుచేస్తున్నారు. ఈ సభకు దాదాపు ఐదు లక్షల మంది గిరిజనులు వస్తున్నారని, పది క్వింటాళ్ల జొన్నలతో రొట్టెలను తయారు చేస్తున్నట్టు చెప్పారు. 

జొన్నరొట్టె, కారం, ఉల్లిగడ్డ, పచ్చి మిరపకాయ తింటే వచ్చే తృప్తి.. ఏ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్లి తిన్నా రాదని, ఇది తెలంగాణలో సంప్రదాయక ఆహారమని గిరిజన నేతలు చెప్పారు. గతంలో టీఆర్ఎస్ కు తొంభై ఐదు శాతం గిరిజనులు తమ ఓట్లు వేశారని, ఎక్కడైతే ఎస్టీ రిజర్వేషన్ సీట్లు ఉన్నాయో అక్కడ టీఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News