Chandrababu: వెండితెరకు ఏపీ సీఎం చంద్రబాబు బయోపిక్.. టైటిల్ రోల్ లో వినోద్ నువ్వుల!

  •  బయోపిక్ ల పర్వంలో మరొకటి 
  • విద్యార్థి నేత నుంచి సీఎం వరకూ చిత్రీకరణ
  • 80 శాతం షూటింగ్ పూర్తి 

ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా బయోపిక్ ల సీజన్ నడుస్తోంది. క్రీడాకారుల నుంచి సినీస్టార్ల వరకూ అందరూ తమ జీవితాల్లోని మంచి చెడులను సమానంగా చూపడంతో ప్రజల నుంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జీవితం ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో చంద్రబాబు పాత్రలో వినోద్ నువ్వుల, ఎన్టీఆర్ గా భాస్కర్ నటిస్తున్నారు.

ఓ నిరుపేద సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు తొలుత విద్యార్థి నేతగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా.. చివరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎదిగిన వైనాన్ని ఈ సినిమాలో చూపించనున్నారు. ఈ సినిమాకు వెంకటరమణ దర్శకత్వం వహిస్తుండగా.. జి.జె.రాజేంద్ర నిర్మిస్తున్నారు.

ఈ సినిమా దర్శకుడు వెంకట రమణ మాట్లాడుతూ.. సినిమా షూటింగ్ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి ఈ రోజుతో 23 ఏళ్లు పూర్తయ్యాయని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్రను విస్మరించలేమన్నారు. ఈ సినిమాకు రాజ్ కిరణ్ పి.ఆర్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News