: చిరంజీవిని లక్ష్యంగా చేసుకునేనా ఆ దాడులు?


రాష్ట్ర రాజకీయాలపై తనదైన ముద్ర వేసే క్రమంలో ఇటీవల కాలంలో దూకుడుగా వ్యవహరిస్తోన్న చిరంజీవికి బ్రేక్ వెయ్యాలని సర్కారు భావిస్తున్నట్టుంది. తాజాగా, రాష్ట్ర సీఐడీ అధికారులు జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీపై దాడులు నిర్వహించడం పలు సందేహాలకు తావిస్తోంది. చిరంజీవికి చెందిన బ్లడ్ బ్యాంకుతో పాటు ఆయన నివాసం కూడా ఈ సొసైటీ పరిధిలోకే వస్తాయి. ఇంటి నిర్మాణం సమయంలో కొంత స్థలం కబ్జాచేశారని ఇంతకుముందు చిరంజీవిపై ఆరోపణలున్నాయి.

తాజా దాడుల్లో సీఐడీ అధికారులు ఆ వ్యవహారానికి సంబంధించిన ఫైలునే స్వాధీనం చేసుకోవడం చిరంజీవిని టార్గెట్ చేశారన్న అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కేంద్ర పర్యాటక మంత్రిగా చిరంజీవి పలు కార్యక్రమాలతో తన ప్రతిష్ఠను క్రమేపీ పెంచుకుంటున్నారు.

ఇటీవలే హైదరాబాద్ లో అంతర్జాతీయ పర్యాటక సదస్సును ఘనంగా నిర్వహించడం, బెర్లిన్ లో జరిగిన టూరిజం ఫెస్టివల్ లో భారత పర్యాటక ప్రాభవాన్ని చాటడం తెలిసిందే. వీటికితోడు కొందరు మంత్రులు చిరంజీవిని తదుపరి సీఎంగా పేర్కొనడం కాంగ్రెస్ లోని కొన్ని వర్గాలకు మింగుడు పడడంలేదు.

  • Loading...

More Telugu News