: చేవ చచ్చిన ప్రభుత్వమిది: యూపీఏపై రాజ్ నాథ్ ఫైర్


యూపీఏ-2 పాలన యావత్తూ అవినీతిమయమైందని, దేశం కుంభకోణాలతో కునారిల్లుతున్నా ప్రధాని నోరు మెదపడంలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ దేశాన్ని దారుణమైన స్థితిలోకి నెట్టవేసిందని రాజ్ నాథ్ ఆరోపించారు. రాజకీయాల వల్లే రాజీనామా చేస్తున్నానని న్యాయశాఖ మంత్రి అశ్వినీ కుమార్ ప్రకటించిన కాసేపటి తర్వాత రాజ్ నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికైనా సర్కారు మేలుకోకపోతే పరిస్థితి మరింత అధ్వానంగా తయారవడం ఖాయమని రాజ్ నాథ్ పేర్కొన్నారు. విధులు సమర్థంగా నిర్వహించడం చేతగాకపోతే పదవికి రాజీనామా చేయడం మేలని, రాజ్ నాథ్.. ప్రధానికి సూచించారు.

  • Loading...

More Telugu News