thamannah: 'ఎఫ్ 2' సెట్లో తమన్నాతో మెహ్రీన్ సెల్ఫీ

  • జోరుగా కొనసాగుతోన్న 'ఎఫ్ 2' షూటింగ్
  • ఇప్పటికే కొంతవరకూ జరిగిన చిత్రీకరణ
  • మంచి స్నేహితులైపోయిన తమన్నా .. మెహ్రీన్

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో దర్శకుడు అనిల్ రావిపూడి దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 2' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకటేశ్ .. వరుణ్ తేజ్ కథానాయకులుగా ఈ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి వినోదాత్మకంగా నిర్మితమవుతోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇక వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ కనిపించనుంది.

రెండు నెలల క్రితం మొదలైన ఈ సినిమా షూటింగ్ జోరుగా కొనసాగుతోంది. ఈ సినిమా కారణంగా తమన్నా .. మెహ్రీన్ మంచి స్నేహితులైపోయారు. రీసెంట్ గా షూటింగు విరామ సమయంలో తమన్నాతో కలిసి మెహ్రీన్ సెల్ఫీ తీసుకుంది. ఆ ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసి .. ఆ ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది. మాస్ ఆడియన్స్ .. యూత్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా థియేటర్స్ కి రప్పించడం అనిల్ రావిపూడికి బాగా తెలుసు. అందువలన ఈ సినిమాపై అన్నివర్గాల ప్రేక్షకుల్లో అంచనాలు వున్నాయి.      

More Telugu News