: సిద్ధరామయ్యా.. శుభాకాంక్షలయ్యా: ప్రధాని
కర్ణాటక ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించనున్న కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్యకు ప్రధాని మన్మోహన్ నేడు శుభాకాంక్షలు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నికైన సిద్ధరామయ్యకు అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర ప్రజానీకానికి మంచి భవిష్యత్తు అందించాలని కోరారు. ఈమేరకు ఢిల్లీలోని ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. నిన్న బెంగళూరులో జరిగిన రహస్య ఓటింగ్ ద్వారా మెజారిటీ ఎమ్మెల్యేలు సిద్ధరామయ్యను సీఎంగా ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని పార్టీ పరిశీలకుడు ఏకే ఆంటోనీ అధికారికంగా ప్రకటించారు.