: రిలయన్స్ సీడీఎంఏ యూజర్లు జీఎస్ఎంకు బదిలీ
మార్కెట్లో పోటీని తట్టుకుని మరింత చొచ్చుకుపోవడానికి రిలయన్స్ కమ్యూనికేషన్స్ కొత్త మార్గాలను అనుసరిస్తోంది. సీడీఎంఏ యూజర్లను జీఎస్ఎం నెట్ వర్క్ కు మార్చనున్నట్లు ప్రకటించింది. సీడీఎంఏ స్పెక్ట్రంను కేవలం వైర్ లెస్ ఇంటర్నెట్ సర్వీసులు అందించడానికి వినియోగించనున్నట్లు తెలిపింది. సీడీఎంఏ కింద ఉన్న వినియోగదారులు ఇంటర్నెట్ డేటాను కూడా వినియోగించుకుంటే వారిని అందులోనే ఉంచుతామని, కేవలం కాల్స్ లాంటి వాయిస్ సర్వీసులను మాత్రమే వినియోగించేవారిని జిఎస్ఎంకు బదిలీ చేస్తామని వెల్లడించింది.