: యూపీఏ అవినీతిపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసన


అవినీతి ఊబిలో కూరుకుపోయినా పదవులు వదులుకోవడానికి ససేమిరా అంటోన్న మంత్రులు.. ఎంతో అప్రదిష్ట మూటగట్టుకున్ప తరువాతే పదవులకు రాజీనామా చేస్తున్నారని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అవినీతి ఆరోపణలు రాగానే నైతిక విలువలకు కట్టుబడి రాజీనామాలు చేసి ఉంటే కాస్త గౌరవంగా ఉండేదని అన్నారు.

యూపీఏపై వస్తున్నన్ని అరోపణలు ప్రపంచంలోని ఏ పార్టీపైనా రాలేదని చమత్కరించారు. యూపీఎ హయాంలో 2జీ కుంభకోణం, బొగ్గు కుంభకోణం వంటి భారీ తప్పులు కాగ్, సీవీసీ, సుప్రీంకోర్టు జోక్యంతోనే బయటపడ్డాయన్నారు. యూపీఏ అవినీతిపై ఈనెల 12 నుంచి దేశవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో పలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

  • Loading...

More Telugu News