Chandrababu: ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకుందాం: సీఎం చంద్రబాబు

  • మోసం చేసిన వారిన వదలం
  • కసిగా పోరాడదాం.. తెలుగువారి సత్తా చాటుదాం
  • ధర్మపోరాట సభలో చంద్రబాబు పిలుపు

ఎన్డీఏ ప్రభుత్వం మెడలు వంచి మన హక్కులు సాధించుకుందామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పిలుపు నిచ్చారు. కర్నూలులో జరుగుతున్న ధర్మపోరాట సభలో ఆయన మాట్లాడుతూ, మోసం చేసిన వారిన వదిలి పెట్టడం తెలుగువారి లక్షణం కాదని, కసిగా పోరాడదామని, తెలుగువారి సత్తా ఏమిటో నిరూపించిన పార్టీ టీడీపీ అని, ఎన్టీఆర్ స్ఫూర్తి మన అందరికీ ఉందని అన్నారు.

నాడు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే ఎదురుతిరుగుతామని, తెలుగువారి సత్తా ఏంటో నిరూపిస్తామని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంపీలు బొబ్బిలిపులిలా పోరాడారంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీని మన ఎంపీలు నిలదీసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏతో పొత్తు పెట్టుకుంటే ఏపీకి అన్యాయం చేశారని, పదకొండు రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఇచ్చి.. రాష్ట్రానికి అన్యాయం చేశారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News