: అవినీతి మంత్రులపై పోరాటం చేస్తా: శంకర్రావు
రాష్ట్ర కేబినెట్ లో అవినీతి మంత్రులు ఉండడం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మాజీ మంత్రి శంకర్రావు, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అభిప్రాయపడుతున్నారు. అవినీతి మంత్రులంతా తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రులు రాజీనామాలు చెయ్యకపోతే వారిపై న్యాయపోరాటం చేస్తానని శంకర్రావు స్పష్టం చేస్తున్నారు. అధిష్టానానికి అవినీతి మంత్రులపై ప్రత్యేక నివేదిక ఇస్తానని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే వారిని తొలగించాల్సిందేనని డిమాండ్ చేశారు.