Chandrababu: ట్రాక్టర్ నడుపుతూ రైతులను ఉత్తేజ పరిచిన చంద్రబాబు.. ఫోటోలు ఇవిగో!
- విజయవాడలో 'ఉద్యాన-2018’ ప్రదర్శన ప్రారంభం
- యంత్ర పరికరాల పరిశీలన
- ఈ నెల 26 వరకు ప్రదర్శన
రాష్ట్ర విభజన అనంతరం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. మారుతోన్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా పంటలను మార్చుకునేలా, రైతులలో చైతన్యం కలిగించేలా విజయవాడలో 'ఉద్యాన-2018’ ప్రదర్శన ప్రారంభించామని అన్నారు. ఈ ప్రదర్శనలో భాగంగా చంద్రబాబు, రైతులను ఉత్తేజపరచడం కోసం ట్రాక్టర్ నడిపిన అనంతరం ఉద్యాన పంటలు, యంత్ర పరికరాలను పరిశీలించారు. ప్రదర్శనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి సోమిరెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా, ఈ నెల 26 వరకు ఈ ప్రదర్శన కొనసాగనుంది.