: కాలిఫోర్నియా యూనివర్సిటీలో సత్తా చాటిన భారతీయుడు


కోల్ కతా విద్యార్థి రితంకర్ దాస్ అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీలో భారతీయుడి సత్తా ఏంటో చూపించాడు. బయో ఇంజనీరింగ్, కెమికల్ బయాలజీ కోర్సు విద్యార్థి అయిన రితంకర్ అన్నింటిలోనూ ముందుండి యూనివర్సిటీ టాపర్ గా నిలిచాడు. దీంతో ఇతడిని ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ మెడల్ వరించింది. దీనిని ఈ నెల 18న స్నాతకోత్సవంలో ప్రదానం చేస్తారు. కాలిఫోర్నియా యూనివర్సిటీ మెడల్ ను 100 ఏళ్ల కాలంలో తొలిసారిగా అందుకుంటున్న పిన్న వయస్కుడిగా రితంకర్ రికార్డు నమోదు చేయబోతున్నాడు.

  • Loading...

More Telugu News