Lessones: మొబైల్ ఫోన్ లో పాఠాలు... ఏపీ కొత్త ప్రయోగం!
- సెల్ ఫోన్ ద్వారా పాఠాలు నేర్చుకునే అవకాశం
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం
- దీక్ష యాప్ తో అనుసంధానం
- యూట్యూబ్ కు అనుసంధానమై విశ్లేషణాత్మకంగా పాఠాలు
దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేసింది. ప్రస్తుతం అందివచ్చిన సాంకేతిక పరిజ్ఞానంతో పాఠ్య పుస్తకాలలోని పాఠాలు మొబైల్ ఫోన్ లో చదువుకునే వెసులుబాటును కల్పించింది. ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ విధానం ఆధునికతకు అద్దం పడుతోంది. చిన్న తరగతుల నుండే టెక్నాలజీ తెలుసుకోవడానికి ఉపకరిస్తుంది. పాఠ్య పుస్తకాల్లో క్యూఆర్ కోడ్ తో రెండు వందల మంది నిష్ణాతులైన ఉపాధ్యాయులు వీటిని రూపొందించారు.
దీక్ష యాప్ తో ఈ కోడ్ ను అనుసంధానం చేస్తూ రూపొందించిన పాఠాలను మొబైల్ ఫోన్ లలో చదువుకోవడానికి వీలవుతుంది. ఈ యాప్ నేరుగా యూ ట్యూబ్ కు అనుసంధానం అయి ఉంటుంది. విద్యార్థులకు అర్థమయ్యేలా బొమ్మలతో విషయ నిపుణులు విశ్లేషణాత్మకంగా బోధిస్తూ రూపొందించిన పాఠాలు ప్రత్యక్షమవుతాయి. తరగతి గదిలో చిన్నారులకు అర్థంకాని పాఠాలు, వారు పాఠశాలకు గైర్హాజరైన సమయంలో వినని పాఠాలను సులువుగా నేర్చుకొనేందుకు ఇవి ఉపకరిస్తాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు.. ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70 లక్షల సంబంధిత పుస్తకాలను చిన్నారులకు పంపిణీ చేశారు. దీనిలో భాగంగా పుసక్తం ప్రతి పేజీలోనూ క్యూఆర్ కోడ్ ముద్రించారు.