: గోతులు తవ్వుకుంటున్న మానవుడు


వాతావరణం గతి తప్పుతోంది. భూతాపంలో ప్రధానపాత్ర పోషించే గ్రీన్ హౌస్ గ్యాస్ లు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే తారస్థాయికి చేరాయి. కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం అంతకంతకూ పెరిగిపోతోంది. ఇది 400 పార్ట్స్ పర్ మిలియన్ ఉన్నట్లు గురువారం హవాయిలోని వాతావరణ పరీక్షా కేంద్రం గుర్తించింది. మంచుయుగంలో కార్బన్ డై ఆక్సైడ్ 80 పార్ట్స్ పర్ మిలియన్ పెరగడానికి 7వేల సంవత్సరాలు పట్టింది.

1958లో 315 పార్ట్స్ పర్ మిలియన్ గా ఉండగా.. నేడది 400పార్ట్స్ పర్ మిలియన్ కు చేరుకుంది. అంటే 85 పార్ట్స్ పర్ మిలియన్ 55 ఏళ్లలోనే పెరిగిపోయింది. మంచుయుగంలో 7వేల సంవత్సరాల్లో పెరిగిన కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం ఇప్పుడు ప్రకృతి విధ్వంసం కారణంగా 55ఏళ్లలోనే పెరిగిపోవడం ప్రమాద తీవ్రతకు సంకేతమని పర్యావరణ నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఏటా 2 పార్ట్స్ పర్ మిలియన్ కార్బన్ డై ఆక్సైడ్ పెరిగిపోతోంది.

ఇంత వేగంగా పెరగడం చాలా ఆందోళనకరమైన విషయమని పెన్సిల్వేనియా యూనివర్సిటీ వాతావరణ నిపుణుడు మైకేల్ మన్ చెప్పారు. కార్బన్ డై ఆక్సైడ్ 1000 ఏళ్ల కాలంలో 100 పార్ట్స్ పర్ మిలియన్ పెరిగితే చెట్లు, జంతువులు స్వీకరించగలవన్నారు. కానీ ప్రస్తుత వేగంతో పెరిగితే చెట్లు, జంతువులు స్వీకరించలేవని చెబుతున్నారు. విద్యుత్ కోసం బొగ్గును విపరీతంగా వాడేయడం, పారిశ్రామిక వ్యర్థాలు, చమురు వినియోగం ద్వారా మనిషే కార్బన్ డై ఆక్సైడ్ ను విపరీతంగా పెంచేస్తున్నాడని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News