Telugudesam: వైసీపీ నేతలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన చంద్రబాబు
- టీడీపీలో చేరిన విజయనగరం, చిత్తూరు జిల్లాల నేతలు
- సైకిలెక్కిన పార్వతీపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీనివాసరావు, జ్యోతి
- పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. విజయనగరం, చిత్తూరు జిల్లాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు అమరావతిలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్వతీపురం, కురుపాం నియోజకవర్గ నేతలకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చంద్రబాబు. టీడీపీలో చేరిన వారిలో పార్వతీపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు శ్రీనివాసరావు, జ్యోతి, సీనియర్ నేత సత్యనారాయణలతో పాటు పలువురు కార్యకర్తలు ఉన్నారు.