: కడియం శ్రీహరిపై విమర్శల వాన
నిన్న మొన్నటి వరకూ టీడీపీలో పదవులు అనుభవించిన కడియం ఇప్పడు అకస్మాత్తుగా రాజీనామా నాటకమాడుతున్నారని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణకు కేసీఆరే అడ్డన్న కడియం టీఆర్ఎస్ లో ఎలాచేరతారని ప్రశ్నిస్తున్నారు. గత కొంతకాలంగా కడియం పార్టీ మారే అలోచనలో ఉన్నారని పదవులు వచ్చినప్పుడు అనుభవిస్తున్నారని పదవులు లేకపోతే పార్టీకి నాయకత్వలోపమని, డబ్బులకు పదవులు అమ్ముకుంటున్నారని, లేకుంటే మరో సాకులు చూపుతూ పార్టీలు మారుతున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. రాజకీయాల్లో విలువలు నశించిపోతున్నాయని, ఇప్పడు పార్టీల్లోని నేతలంతా జంపుజిలానీలుగా మారిపోతున్నారని విమర్శించారు. పార్టీని ఒకరిద్దరు వీడితే వచ్చే నష్టమేమీ ఉండదని అన్నారు.