conductor: వేగంగా వెళుతున్న బస్సు నుంచి కిందకు పడిపోయిన కండక్టర్.. తీవ్ర గాయాలు.. వీడియో చూడండి

  • ఫుట్ బోర్డుపై నిల్చున్న కండక్టర్
  • బస్సు టర్న్ అవుతున్న సమయంలో పట్టు తప్పి కిందకు పడిపోయిన వైనం
  • ప్రైవేట్ ఆసుపత్రికి తరలించిన డ్రైవర్, ఇతర ప్రయాణికులు

వేగంగా వెళ్తున్న ఆర్టీసీ సిటీ బస్సు నుంచి కండక్టర్ కిందకు పడిపోయిన ఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే, బస్సు వెళ్తున్న సమయంలో కండక్టర్ ఫుట్ బోర్డుపై నిల్చున్నాడు. ఓ కూడలి వద్ద బస్సు టర్న్ అవుతున్న సమయంలో పట్టుతప్పి, ప్రమాదవశాత్తు కిందకు పడిపోయాడు. వెంటనే ప్రయాణికులు గట్టిగా అరవడంతో డ్రైవర్ బస్సును నిలిపివేశాడు. ఈ ప్రమాదంలో కండక్టర్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన అతడిని డ్రైవర్ తో పాటు, బస్సులో ఉన్న కొందరు ప్రయాణికులు దగ్గర్లో ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఈ ఘటన హైదరాబాదులోని వేవ్ రాక్ ప్రాంతంలో చోటు చేసుకుంది.

More Telugu News