Narendra Modi: ఓవైపు ఆనందంగా ఉంది.. మరోవైపు దుఃఖం పొంగుకొస్తోంది: మోదీ

  • దేశ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందుకు ఆనందంగా ఉంది
  • మరోవైపు వరదలు బాధిస్తున్నాయి
  • ఎర్రకోటపై నుంచి కొనసాగుతున్న మోదీ ప్రసంగం

దేశంలో ఈసారి వానలు పుష్కలంగా పడుతున్నాయన్న ఆనందం ఉన్నా.. మరోవైపు వరదలు ముంచెత్తడం బాధగా ఉందని ప్రధాని నరేంద్రమోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎర్రకోటపై నుంచి మోదీ ప్రసంగం కొనసాగుతోంది. దేశ రక్షణలో త్రివిధ దళాలు ఆత్మార్పణ చేస్తున్నాయన్నారు. దేశ ప్రజలందరి తరపున త్యాగధనులందరికీ ప్రమాణం చేస్తున్నానన్నారు. 125 కోట్ల మంది ప్రజలు ఒక్కతాటిపై నిలిచి ముందడుగు వేసేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు.

దేశం ఈ రోజు గరిష్ఠ స్థాయిలో ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేస్తోందని మోదీ వివరించారు. వీటితోపాటు మొబైల్ ఫోన్లనూ భారత్ ఉత్పత్తి చేస్తోందన్నారు. సంపద సృష్టిలో యువత కొత్తదారుల వెంట పరుగులు తీస్తోందన్న మోదీ..13 కోట్ల మంది ముద్రా రుణాలు తీసుకుంటే అందులో 4 కోట్ల మంది యువతే ఉండడం ఇందుకు నిదర్శనమన్నారు. స్టార్టప్‌లను ప్రారంభించేవారిలోనూ 99 శాతం మంది యువతే ఉన్నారని తెలిపారు. డిజిటల్ ఇండియాలో 3 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు ఉన్నాయన్నారు. మంగళయాన్ విజయంతో మన శాస్త్రవేత్తల కృషిని ప్రపంచానికి చాటామని, మానవ సహిత అంతరిక్ష యాత్రలు చేపట్టి కలలను సాకారం చేసి చూపించాల్సి ఉందన్నారు.

More Telugu News