shiva shankar: 'రగులుతోంది మొగలిపొద'కి డాన్స్ చేశాక మూడు నెలలు బాధపడ్డాను: శివశంకర్ మాస్టర్

  • మా నాన్నతో చెప్పి డాన్స్ నేర్చుకున్నాను 
  • సలీమ్ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేశాను 
  • తెలుగులో నా మొదటి సినిమా 'ఖైదీ'

నృత్య దర్శకుడిగా శివశంకర్ మాస్టర్ కి ఎంతో మంచి పేరు వుంది. అప్పట్లో ప్రతి సినిమాలోనూ ఆయన పేరు కనిపించేది. అలాంటి శివశంకర్ మాస్టర్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పుకొచ్చారు. "చిన్నప్పటి నుంచి వెన్నెముక సమస్యతో బాధపడుతూ వస్తున్నాను. 16 .. 17 యేళ్లు వచ్చేసరికి మా నాన్నకి తెలియకుండా స్టేజ్ పై డాన్సులు చేయడం మొదలుపెట్టాను.

 ఒకసారి ఈ విషయం మా నాన్నకి తెలిసిపోయింది. మా నాన్న నన్ను పిలిపించినప్పుడు 'నాకు డాన్స్ నేర్చుకోవాలని వుంది' అని చెప్పాను. ఆయన కొంతమందికి నా జాతకం చూపించి .. డాన్స్ నేర్పించారు. డాన్స్ నేర్చుకున్న తరువాత నేను డాన్స్ మాస్టర్ సలీమ్ దగ్గర అసిస్టెంట్ గా చేరాను. తెలుగులో నృత్య దర్శకుడిగా నేను చేసిన మొదటి సినిమా 'ఖైదీ'. ఈ సినిమాలో 'రగులుతోంది మొగలిపొద' పాటలో స్నేక్ డాన్స్ చేయాలి .. అది చాలా కష్టమైన డాన్స్. వెన్నెముక సమస్యను పట్టించుకోకుండా ఆ పాటకు డాన్స్ చేశాను .. ఆ తరువాత మూడు నెలల పాటు బాధపడ్డాను"అని చెప్పుకొచ్చారు.  

More Telugu News