: ఐపిఎల్ జట్లకు విదేశీ కోచ్ లే ముద్దు
భారతీయ వెటరన్ ఆటగాళ్ళకు కోచ్ లుగా రాణించే సామర్ధ్యం లేదని పలువురు ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు అభిప్రాయపడుతున్నారు. భారతీయ ఆటగాళ్ళు మెంటర్లుగా, కామెంటేటర్లుగా రాణిస్తారే కానీ కోచ్ లుగా రాణించరని చెబుతున్నారు. అందుకు ఉదాహరణగా హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, ఫుట్ బాల్ వంటి క్రీడలు తీసుకున్నా వాటికి కోచ్ లుగా విదేశీయులే ఉంటున్నారని చెబుతున్నారు. కోచ్ కావాలంటే నిరంతరం నేర్చుకునే లక్షణం చాలా అవసరమని దానికి తొడు జట్టుని సన్నద్దం చేయాలని అందుకు భారతీయులు సరిపోరని ఐపీఎల్ ఫ్రాంచైజీల అభిప్రాయం. దీంతో ఫ్రాంచైజీలకు విదేశీకోచ్ లనే ఎంపిక చేసుకుంటున్నారు.