: వివాదంపై స్పందించేందుకు సెన్సార్ బోర్డు అధికారిణి నిరాకరణ
'26/11 దాడులు' చిత్రంపై దాఖలైన ఫిర్యాదుపై స్పందించేందుకు ప్రాంతీయ సెన్సార్ బోర్డు అధికారిణి ధనలక్ష్మి నిరాకరించారు. ఈ సినిమాకు క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇవ్వడంపై విలేకరులు ప్రశ్నించగా సమాధానం చెప్పేందుకు ఆమె నిరాకరించారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ తీసిన ఈ సినిమా మత సామరస్యానికి వ్యతిరేకంగా ఉందని హైకోర్టు న్యాయవాది రామ్ ప్రసాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డులో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది.
- Loading...
More Telugu News
- Loading...