Honor Play: పవర్ ఫుల్ ప్రాసెసర్ తో ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ విడుదల!

  • ఢిల్లీలో విడుదలైన ఆనర్ ప్లే
  • రెండు వేరియంట్ లలో లభ్యం
  • సాయంత్రం 4 గంటల నుండి ఆన్ లైన్లో విక్రయం  

గత నెల చైనాలో విడుదలైన ఆనర్ ప్లే స్మార్ట్ ఫోన్ తాజాగా ఈరోజు భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో విడుదలైన ఈ ఫోన్ అమెజాన్ ఇండియా వెబ్ సైట్, ఆనర్ స్టోర్లలో ఈరోజు సాయంత్రం 4 గంటల నుండి విక్రయానికి అందుబాటులోకి రానుంది. 4జీబీ వేరియంట్ ధ‌ర రూ.19,999 ఉండగా, 6జీబీ వేరియంట్ ధ‌ర రూ.23,999గా ఉంది. గేమింగ్ సూట్ ఫీచర్ ని కూడా కలిగి ఉన్న ఈ ఫోన్ నేవీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్ కలర్లలో అందుబాటులో ఉంటుంది.

ఆనర్ ప్లే ఫీచర్లు:

  • హైసిలికాన్ కిరిన్ 970 ప్రాసెసర్
  • 6.3" డిస్‌ప్లేతో పాటు 1080×2340 పిక్సెల్ స్క్రీన్ రిజల్యూషన్
  • ఆండ్రాయిడ్ 8.1 ఆపరేటింగ్ సిస్టం
  • డ్యూయల్ బ్యాక్ కెమెరా: 16/2 మెగాపిక్సెల్
  • ఫ్రంట్ కెమెరా: 16 మెగాపిక్సెల్
  • ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ (మెమొరీ కార్డు ద్వారా 256 వరకు పెంచుకునే సౌకర్యం)
  • 3750ఎంఏహెచ్‌ బ్యాట‌రీ

More Telugu News