ramana deekshitulu: రమణ దీక్షితులు సన్నిహితుడి అరెస్ట్.. అనంతపురంకు తరలింపు!

  • అనంతపురం యహోవా మందిరంలో రెండు వర్గాల మధ్య పోరు
  • ఒక వర్గానికి అండగా ఉన్న అనిల్
  • న్యాయం చేయాలంటూ ఎస్పీ, సీఐలకు ఫోన్లు

తిరుమల మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు సన్నిహితుడైన క్రిస్టియన్ సంఘం అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరులో అతన్ని అరెస్ట్ చేసి అనంతపురంకు తరలించారు. వివరాల్లోకి వెళ్తే, అనంతపురంలోని రామచంద్రానగర్ యహోవా మందిరంలో రెండు వర్గాల మధ్య ఆర్థిక, ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ నేపథ్యంలో, ఒక వర్గానికి అనిల్ అండగా నిలిచారు.

యహోవా మందిరం గొడవకు సంబంధించి ఓసారి ఐఏఎస్ అధికారిగా చెప్పుకుని తన వర్గానికి న్యాయం చేయాలంటూ జిల్లా ఎస్పీకి అనిల్ ఫోన్ చేశారు. ఇదే విధంగా కేంద్ర మంత్రి రామస్వామి ఓఎస్డీగా చెప్పుకుని త్రీటౌన్ సీఐ మురళీకృష్ణకు కూడా ఫోన్ చేశారు. చర్చి వివాదాన్ని పరిష్కరించాలని సూచించాడు. పలుమార్లు బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో, అతని ఫోన్ పై నిఘా పెట్టిన పోలీసులు... చివరకు ఆ ఫోన్లు చేస్తున్న వ్యక్తిని అనిల్ గా గుర్తించారు. అతన్ని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్లు 120 (బి), 506, 185, 419ల కింద కేసు నమోదు చేశారు.

టీటీడీ అంశానికి సంబంధించి రమణ దీక్షితులుకు అండగా నిలిచి, హైకోర్టులో కేసు కూడా అనిల్ వేయించారు.

More Telugu News