: శ్రీవారి సేవలో బాబు
తిరుమల వెంకటేశ్వరుడిని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు దర్శించుకున్నారు. ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొన్నారు. పేదరికం లేని సమాజం ఏర్పడాలని, అవినీతి అంతం కావాలని స్వామివారిని కోరుకున్నట్లు అనంతరం ఆలయం బయట చంద్రబాబు మీడియాకు చెప్పారు.