Chandrababu: తండ్రి పది లక్షలు కూడా ఇవ్వలేదు కానీ.. కొడుకు 10 వేల కోట్లు ఇస్తాడట!: జగన్‌కు చంద్రబాబు చురక

  • ప్రతిపక్ష నేతపై దుమ్మెత్తి పోసిన చంద్రబాబు
  • జగన్‌లో అపరిపక్వత, అసహనం కనిపిస్తున్నాయని వ్యాఖ్య
  • వైసీపీ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందన్న సీఎం

ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సెటైర్లు వేశారు. కాపు రిజర్వేషన్ల విషయంలో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు అతని మానసిక స్థితికి నిదర్శనమన్నారు. జగన్ తండ్రి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపుల సర్వే కోసం నియమించిన సుబ్రహ్మణ్యం కమిటీకి పది లక్షల రూపాయలు ఇచ్చేందుకు చేతులు రాలేదని, కానీ ఇప్పుడు ఆయన కుమారుడు ఏకంగా పది వేల కోట్ల రూపాయలు ఇస్తానని చెబుతున్నారని, అవి నమ్మే మాటలేనా? అని చురకలంటించారు. అప్పట్లో రూ.10 లక్షలు ఇవ్వని కారణంగా ఆ సర్వే ఆగిపోయిందని చంద్రబాబు గుర్తు చేశారు.

వందల కోట్ల రూపాయలు చెల్లించి ప్రశాంత్ కిశోర్ వంటి కన్సల్టెంట్లను పెట్టుకున్నా వైసీపీ పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని, నానాటికీ మరింతగా దిగజారిపోతోందని విమర్శించారు. ఆ పార్టీ అధ్యక్షుడు రోజుకో మాట చెబుతున్నారని దుయ్యబట్టారు. అసహనం, అపరిపక్వత, నాయకత్వ సామర్థ్య లేమితో వైసీపీ కొట్టుమిట్టాడుతోందన్నారు.

  • Loading...

More Telugu News