Hyderabad: హజ్ యాత్రను జెండా ఊపి ప్రారంభించిన తెలంగాణ డిప్యూటీ సీఎం
- నేటి నుంచి ఆగస్ట్ 16 వరకు ఈ యాత్ర కొనసాగుతుంది
- తెలంగాణ నుంచి ఈ ఏడాది 7800 మంది వెళ్తున్నారు
- ప్రతి విమానంలో 300 వందల మంది చొప్పున వెళ్తారు
తెలంగాణ రాష్ట్రం నుంచి హజ్ యాత్రకు తొలి బృందం బయలు దేరింది. ఈరోజు ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని హజ్ టెర్మినల్ లో విమానానికి డిప్యూటీ సీఎం మహమూద్ అలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హజ్ కమిటీ చైర్మన్ మసిఉల్లహ ఖాన్, సెంట్రల్ హజ్ కమిటీ సభ్యుడు ఎం ఎం అష్రాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ, రాష్ట్రం నుండి ఈ ఏడాది 7800 మంది హజ్ యాత్రికులు ఈ యాత్రకు వెళ్తున్నట్లు చెప్పారు. నేటి నుంచి ఆగస్ట్ 16 తేదీ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని, ప్రతి విమానంలో 300 వందల మంది చొప్పున హజ్ యాత్రకు వెళ్తారని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ హజ్ యాత్రికుల కోసం మంచి ఏర్పాట్లు చేశారని, ప్రభుత్వం చేసిన ఏర్పాట్లకు హజ్ యాత్రికులు హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. కాగా, హజ్ యాత్రకు వెళ్లే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని మహమూద్ అలీ ఆదేశించారు.