: ముస్లిం సంఘాలతో నేడు కమల్ చర్చలు
తమిళనాడు ప్రభుత్వం ’విశ్వరూపం‘పై నిషేదం విధించిన నేపథ్యంలో, ముస్లిం సంఘాలతో చిత్ర నిర్మాతలు నేడు చర్చలు జరుపనున్నారు. సమస్య పరిష్కారం కోసం శుక్రవారం కమల్ హాసన్ సోదరుడు చంద్రహాసన్ ప్రభుత్వాదికారులు, ముస్లిం సంఘాలతో తొలి దఫా చర్చలు జరిపారు. అయితే కమల్ హాసన్ రావాలని ముస్లిం ప్రతినిధులు కోరడంతో, చర్చలు నేటికి వాయిదాపడ్డాయి. దాంతో కమల్ హాసన్ వారితో భేటీ కావాలని నిర్ణయించారు. దీంతో చిత్ర ప్రచారంలో భాగంగా ముంబయిలో ఉన్న కమల్ ఈ రోజు చెన్నైకి చేరుకొని చర్చల్లో పాల్గొంటారు.