: ఏరోబిక్ వ్యాయామాలతో రొమ్ము క్యాన్సర్ తగ్గుముఖం
మన సినిమాల్లో హీరోయిన్లను కాస్త సెక్సీగా చూపించాలంటే దర్శకులు ఎంచుకునే కొన్ని సులభమైన పద్ధతుల్లో ఏరోబిక్ వ్యాయామాలు చేస్తున్నట్లు చూపించడం కూడా ఒకటి. అయితే ఈ ఏరోబిక్ వ్యాయామాల వల్ల ఆరోగ్యం మీద మంచి ప్రభావం ఉంటుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా అమ్మాయిల్లో చాలా సాధారణంగా మారుతున్న రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఏరోబిక్స్ చాలా వరకు దూరం చేస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
ఈ వ్యాయామాలు మన శరీరంలోని ఈస్ట్రోజన్‌ను విచ్ఛిన్నం చేసి 'మంచి' మెటాబొలైట్స్ తయారయ్యేలా చూస్తాయి. దీనివల్ల క్యాన్సర్ సోకే అవకాశాలు తగ్గుతాయి. శారీరక శ్రమే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందనేది తాజా అధ్యయనాల ఫలితం. అయితే ఈ విషయాన్ని వివరించే వైద్యపరమైన అధ్యయనాలు లేవని.. మిన్నెసోటా యూనివర్సిటీలోని ఫుడ్ సైన్స్ మరియు న్యూట్రిషన్ శాఖ ప్రొఫెసర్ మైండీ ఎస్ కర్జర్ చెబుతున్నారు. 'వ్యాయామం అనేది ఫిట్‌నెస్‌కు గుండె ఆరోగ్యం మెరుగుపడడానికి కారణమౌతుందని మనకు తెలుసు. అయితే అది ఈస్ట్రోజన్ మెటబోలిజంను మార్చగలగడం ద్వారా.. రొమ్ము క్యాన్సర్‌ను నిరోధించడానికి కూడా సాయపడుతుందని' కర్జర్ చెబుతున్నారు.