: గుండెజబ్బుల డౌటుందా? ఓ కుక్కను తెచ్చుకోండి!


అలాగని డాక్టరును సంప్రదించడం మరచిపొమ్మని మా సలహా కాదు గానీ.. మీకంటూ ఓ పెంపుడు కుక్క ఉంటే.. దాని ప్రేమే మీలో గుండె జబ్బులను చాలా వరకు దూరం చేసేస్తుందిట. అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ వారు తమ తాజా బులెటిన్‌లో పెంపుడు కుక్కల అలవాటు, గుండెజబ్బు ఉన్న వారు ఎక్కువ కాలం జీవించేందుకు ఉపకరిస్తోందని నివేదించారు. గతంలో కూడా పెంపుడు జంతువులు మన ఆరోగ్యం, మానసిక స్థితిపై చూపగల ప్రభావం గురించి అనేక అధ్యయనాలు జరిగాయి. వీటిని బేలార్‌ కాలేజ్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రొఫెసర్‌ ఎన్‌.లెవైన్‌ నేతృత్వంలో పరిశోధకులు ఇటీవల సమీక్షించారు. పెంపుడు జంతువులు మనుషులకు చాలా గొప్ప స్నేహితులు కాగలవని... న్యూయార్క్‌ మినియోలా లోని విన్‌త్రాప్‌ యూనివర్సిటీ హాస్పిటల్‌ లో ఒక డైరక్టర్‌ బార్బరా జార్జ్‌ అంటున్నారు.

గుండెజబ్బు ముప్పు కారణాలు తగ్గుముఖం పట్టడానికి, పెంపుడు జంతువులకు సంబంధం ఉండొచ్చని వారు గుర్తించారు. అయితే కుక్కల పెంపకం అలవాటు.. గుండెజబ్బులపై 'ఎలా ?' ప్రభావం చూపిస్తుందన్నది మాత్రం ఇదమిద్ధంగా తేలలేదు. కుక్కలను పెంచేవారు.. వాటికోసం అయినా సరే ఎక్కువగా తిరుగుతూ నడుస్తూ ఉంటారు గనుక.. ఆ వ్యాయామం అంతా వారి ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపిస్తుందనేది ఒక అంచనా. అయితే కుక్కల పెంపకం, అవి చూపించే ప్రేమ, వాటితో పంచుకునే మూడ్స్‌ వంటివి ప్రభావం చూపగలవని మానసిక కోణంలోంచి ఏమీ తేలకపోవడం విశేషం.

  • Loading...

More Telugu News