YSRCP: ప్రత్యేక హోదాకు మీరు వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారు బాబూ?: జగన్ సూటి ప్రశ్న
- బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం కుట్ర
- విద్యాసంస్థలు, కార్యాలయాలను మూసి వేయించిన నేతలు
- పలువురు నేతల అరెస్ట్
తాము తలపెట్టిన బంద్‌ను ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తోందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైరయ్యారు. ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్‌ను విఫలం చేయాలని చూస్తోందని ఆరోపించారు. ఈ మేరకు జగన్ ట్విట్టర్ ద్వారా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు టీడీపీ వ్యతిరేకం కాకపోతే బంద్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.
ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం రాష్ట్రబంద్‌కు వైసీపీ పిలుపు నిచ్చింది. మిగతా ప్రతిపక్షాలు ఆ పార్టీకి మద్దతు ప్రకటించకపోయినప్పటికీ, ఆ పార్టీ నేతలు మాత్రం బంద్ నిర్వహిస్తున్నారు. చాలా చోట్ల విద్యాసంస్థలు, దుకాణాలను మూసివేయించారు. వాహనాలు రోడ్లపైకి రాకుండా అడ్డుకున్నారు. బంద్ నిర్వహిస్తున్న పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.