: ఆర్టీసీ ఛార్జీలు పెరిగే అవకాశం!
డీజిల్ ధరను పెంచుతూ చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సామాన్యుడిపై ప్రభావం చూపనుంది. డీజిల్ ధర పెరిగినప్పుడల్లా ఛార్జీలు పెంచే ఆర్టీసీ.. తాజా ధరల పెంపుతో మరోసారి ఛార్జీలు వడ్డించేందుకు సన్నద్ధమవడం ఖాయం! ఇప్పటికే రుణ భారంతో సతమతమవుతున్న ఆర్టీసీకి డీజిల్ ధరల పెంపు శరాఘాతమే. భారం తగ్గించుకోవాలంటే, వారికి ఛార్జీలు పెంచడం మినహా మరో మార్గంలేదు.