BlackBerry: డ్యూయల్‌ కెమెరాలతో మొట్ట మొదటి బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్‌ విడుదల!

  • తొలిసారిగా డ్యూయల్‌ కెమెరాలతో ‘బ్లాక్‌బెర్రీ కీ2’ విడుదల
  • ఈ నెల 31 నుండి అమెజాన్‌ ద్వారా అందుబాటులోకి
  • రూ.4,450 విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ ప్రకటించిన జియో

ప్రముఖ మొబైల్‌ సంస్థ బ్లాక్‌బెర్రీ ఆకట్టుకొనే క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు, డ్యూయల్‌ కెమెరాలాంటి ఫీచర్లతో నూతన స్మార్ట్‌ఫోన్‌ ని విడుదల చేసింది. ‘బ్లాక్‌బెర్రీ కీ2’ పేరిట తాజాగా భారత మార్కెట్లోకి విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్‌, ఈ నెల 31 నుండి అమెజాన్‌ ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించారు.

 క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు తో పాటు 4.5 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే ని ఇందులో ఏర్పాటు చేశారు. ధర రూ.42,990గా ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్‌ తొలిసారిగా డ్యూయల్‌ కెమెరాలతో విడుదల అవుతోంది. అలాగే ‘బ్లాక్‌బెర్రీ కీ2’ కొనుగోలు చేసే వినియోగదారుల కోసం జియో సంస్థ రూ.4,450 విలువ గల క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని ప్రకటించింది. దీంతో పాటు ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్ కార్డు ఉపయోగించి 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ని పొందవచ్చు.

‘బ్లాక్‌బెర్రీ కీ2’ ఫీచర్లు:

  • 12 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరా, 8మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా
  • 4.5ఇంచ్ టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే
  • 6జీబీ ర్యామ్, 64/128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ (2టీబీ వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు)
  • ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం
  • క్వెర్టీ ఫిజికల్‌ కీబోర్డు
  • ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  • 1620 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
  • హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ
  • ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3500ఎంఏహెచ్ బ్యాటరీ

More Telugu News