Chandrababu: అంతా సమసిపోయింది: చంద్రబాబుతో సమావేశం తర్వాత జేసీ దివాకర్ రెడ్డి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సమావేశమయ్యారు. అమరావతికి వెళ్లిన ఆయన చంద్రబాబుతో 20 నిమిషాల పాటు చర్చించారు. భేటీ అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ, సీఎంతో చాలా విషయాలు మాట్లాడానని, ఏం మాట్లాడానో మాత్రం చెప్పనని అన్నారు. దేశంలో రాజకీయ వాతావరణం బాగోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు. తాను పార్లమెంటు సమావేశాలకు హాజరవుతున్నానని చెప్పారు. మోదీ ప్రధానిగా ఉన్నంతకాలం విభజన హామీలు అమలుకాబోవని అన్నారు.

సీడబ్ల్యూసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై తీర్మానం ఒట్టి మాటేనని జేసీ చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేని కాంగ్రెస్... ఇప్పుడేం చేస్తుందని ప్రశ్నించారు. మరోవైపు, రాజీనామా వంటి ప్రకటనలపై జేసీకి చంద్రబాబు గట్టిగానే హితబోధ చేసినట్టు సమాచారం. చంద్రబాబుతో భేటీ అనంతరం సచివాలయానికి వచ్చిన జేసీ... పెండింగ్ ఫైల్స్ కు సంబంధించి ఉన్నతాధికారులను కలిశారు. 
Chandrababu
jc diwakar reddy
meeting

More Telugu News