Metro Rail: ఈ నెల 16 నుంచి మారనున్న హైదరాబాద్ మెట్రో రైలు సమయాలు!

- ఇకపై ఉదయం 6:30లకు మొదలు కానున్న రైలు
- చివరి రైలు సమయంలో మార్పు లేదు
- ట్రయల్ రన్స్ కారణంగానేనన్న మెట్రో
సోమవారం నుంచి హైదరాబాద్ మెట్రో రైలు వేళ్లలో మార్పులు చేయనున్నట్టు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ లిమిటెడ్ తెలిపింది. సాంకేతిక కారణాల వల్ల ఆదివారం సహా అన్ని రోజుల్లోనూ రైలు వేళలను తాత్కాలికంగా మార్చనున్నట్టు పేర్కొంది. ప్రస్తుతం ఉదయం 6 గంటలకు మొదలవుతున్న రైళ్లు ఇకపై 6:30 గంటలకు ప్రారంభమవుతాయని పేర్కొంది. అయితే, చివరి సర్వీసు వేళల్లో మాత్రం ఎటువంటి మార్పు ఉండబోదని తెలిపింది. అయితే, ఈ వేళలు తాత్కాలికమేనని, అమీర్పేట-ఎల్బీనగర్, అమీర్పేట-హైటెక్ సిటీ మధ్య ట్రయల్ రన్స్ జరుగుతుండడం వల్లే వేళలను మార్చినట్టు పేర్కొంది. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని కోరింది.