: చెన్నైలో నయనతార, ఆర్య పెళ్ళి డ్రామా
ఓ తమిళ నిర్మాత తన చిత్రానికి ఆయాచితంగా పబ్లిసిటీ కొట్టేయాలనుకున్న ప్రయత్నంలో మీడియాను గందరగోళంలో ముంచెత్తాడు. తమిళంలో 'రాజ-రాణి' చిత్రం ప్రారంభోత్సవం సందర్భంగా.. చెన్నైలోని మీడియా ప్రతినిధులకు తన పీఆర్ఓ ద్వారా ఈమెయిళ్ళు పంపాడు. హీరో ఆర్యతో హీరోయిన్ నయనతార వివాహం జరగనుందని, అందరూ విచ్చేయాలన్నదే దాని సారాంశం. ఆ మెయిల్ లో హీరోహీరోయిన్ల చిత్రాలతో వివాహ పత్రిక కూడా జతచేయడంతో అందరూ ఆ విషయం నిజమేనని నమ్మారు. కానీ, అది ఉత్తిత్తి 'సినిమా పెళ్ళి' అని తెలియడంతో అందరూ ఇదో చీప్ ట్రిక్ అని కొట్టిపారేశారు. ఇక నయనతార, ఆర్య క్షమించండంటూ ఈమెయిళ్ళు పంపడంతో ఆ సందడి సద్దుమణిగింది.