Andhra Pradesh: ఈ నెల 20 నుంచి ఏపీ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మె

  • విజయవాడలో లారీ ఓనర్స్ అసోసియేషన్ అత్యవసర సమావేశం
  • పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్
  • సమ్మెకు 13 జిల్లాల లారీ యజమానుల మద్దతు

ఈ నెల 20 నుంచి ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ నిరవధిక సమ్మెకు దిగనుంది. ఈ రోజు విజయవాడలో అసోసియేషన్ అత్యవసర సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమ్మెకు 13 జిల్లాలకు చెందిన లారీ యజమానులు తమ మద్దతు తెలిపారు. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని, గడువు ముగిసిన టోల్ ప్లాజాలను వెంటనే నిలిపివేయాలని, జీఎస్టీ, ఈ-వే బిల్ సమస్యలను పరిష్కరించాలని, థర్డ్ పార్టీ ప్రీమియం పెంపును నిలిపివేయాలని, డిమాండ్ చేస్తూ ఈ బంద్ ను తలపెట్టనున్నట్టు లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చెప్పారు. 

  • Loading...

More Telugu News