Jagan: వైసీపీలో చేరిన మాజీ మంత్రి మహీధర్ రెడ్డి

  • పెద్ద సంఖ్యలో వైసీపీలో చేరిన కందుకూరు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు
  • పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన జగన్
  • జగన్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారన్న మహీధర్ రెడ్డి

ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి నేడు వైసీపీలో చేరారు. తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న పాదయాత్రలో పార్టీ అధినేత జగన్ ను కలిసి, వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కందుకూరు నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలు కూడా వైసీపీలో చేరారు. వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు జగన్.

ఈ సందర్భంగా మహీధర్ రెడ్డి మాట్లాడుతూ, జగన్ నాయకత్వాన్ని, రాష్ట్రంలో మార్పును ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. వైయస్ ఆశయాలను జగన్ నెరవేరుస్తారని ప్రజలు ఆశలు పెట్టుకున్నారని... జగన్ సిద్ధాంతాలకు ఆకర్షితుడనై వైసీపీలో చేరానని తెలిపారు. రాష్ట్రాభివృద్ధిని కాకుండా, వ్యక్తిగత అభివృద్ధిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుకుంటున్నారని విమర్శించారు. 

  • Loading...

More Telugu News