sumanth sailendra: మారుతి అందించిన ఆసక్తికరమైన కథతో 'బ్రాండ్ బాబు'
- ప్రభాకర్.పి దర్శకత్వంలో 'బ్రాండ్ బాబు'
- హీరోగా సుమంత్ శైలేంద్ర పరిచయం
- కథానాయికగా ఈషా రెబ్బ
మంచి దర్శక నిర్మాతగానే కాదు .. రచయితగాను మారుతికి పేరుంది. తన సినిమాలకి మాత్రమే కాకుండా .. ఇతరుల సినిమాలకి కూడా ఆయన కథలను అందిస్తుంటాడు. ఆయన కథను అందించిన చిత్రంగా 'బ్రాండ్ బాబు' రూపొందుతోంది. శైలేంద్ర నిర్మాణంలో ..ప్రభాకర్.పి దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమవుతోంది. సుమంత్ శైలేంద్ర .. ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరిదశకు చేరుకుంది.
తాజాగా ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. మురళీశర్మ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాలో, రాజారవీంద్ర .. 'సత్యం'రాజేశ్ .. పూజిత పొన్నాడ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. యూత్ కు .. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని అంటున్నారు. 'బ్రాండ్ బాబు' ద్వారా హీరోగా తెలుగు తెరకి పరిచయమవుతోన్న సుమంత్ శైలేంద్రకి ఈ సినిమా ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.