amala paul: రెండో పెళ్లి చేసుకోనున్న అమలాపాల్ మాజీ భర్త

  • 2014 జూన్ లో వివాహం చేసుకున్న అమలాపాల్, విజయ్
  • మనస్పర్థల కారణంగా విడిపోయిన జంట
  • ఈ ఏడాది చివర్లోగా విజయ్ కి పెళ్లి చేయాలనుకుంటున్న తల్లిదండ్రులు

కెరీర్ విజయవంతంగా కొనసాగుతున్న సమయంలో... దర్శకుడు విజయ్ ను హీరోయిన్ అమలాపాల్ పెళ్లాడిని సంగతి తెలిసిందే. 2014 జూన్ లో వివాహం చేసుకున్న వీరు... ఆ తర్వాత మనస్పర్థల కారణంగా విడిపోయారు. ప్రస్తుతం అమలాపాల్ వరుసగా సినిమాలు చేస్తుండగా... విజయ్ దర్శకుడిగా బిజీగా ఉన్నాడు. తాజాగా, విజయ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో విజయ్ కి పెళ్లి చేయాలని ఆయన తల్లిదండ్రులు భావిస్తున్నారట. ప్రస్తుతం పెళ్లి కుమార్తెను వెతికే పనిలో ఉన్నారు. మరోవైపు, ఈ వార్తలన్నీ అబద్ధాలే అని విజయ్ స్నేహితులు కొట్టిపారేస్తుండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News