India: భారత క్రిస్టియన్లను బ్రిటిషర్లుగా అభివర్ణిస్తూ బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
- ముంబయి నార్త్‌కు చెందిన బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి
- హిందూ, ముస్లింలు మాత్రమే స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారు
- క్రైస్తవులు ఈ పోరాటంలో పాలు పంచుకోలేదు
క్రైస్తవులు బ్రిటిషర్లు అంటూ ముంబయి నార్త్‌కు చెందిన బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా, ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... హిందువులు, ముస్లింలు మాత్రమే భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించారని, క్రైస్తవులు ఈ పోరాటంలో పాలు పంచుకోలేదని వ్యాఖ్యానించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. షియా కబరిస్థాన్ కమిటీ ఏర్పాటు చేసిన ఈద్-ఇ-మిలాద్ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.