: 'ఈనాడు'పై అంబటి ధ్వజం
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ఈనాడు పత్రికపై ధ్వజమెత్తారు. 'ఈనాడు' తెలుగుదేశం పార్టీకి అధికార ప్రతినిధిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అవినీతి కేసులపై వార్తల్లో టీడీపీకి అనుకూలంగా రాస్తోందని అన్నారు. ఎమ్మార్ కేసుపై వార్తలో ఓ చోట చంద్రబాబు పేరు రాయకుండా, అప్పటి ముఖ్యమంత్రి అని పేర్కొన్నారని అంబటి తెలిపారు. ఎకరం అసలు విలువ రూ. 4 కోట్లుగా ఉన్నపుడు కారుచవకగా రూ.29 లక్షలకే కట్టబెట్టిన ఘనత బాబుదేనని అంబటి విమర్శించారు. సీబీఐ ఈ వ్యవహారంలో బాబు పాత్రపై ఎందుకు విచారణ జరపడంలేదని ఆయన ప్రశ్నించారు.