Hyderabad: మధ్యాహ్నమే పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్‌కు జగన్!
- తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగిన పాదయాత్ర
- జగన్ వెంట నడిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్
- అక్రమాస్తుల కేసులో రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు జగన్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నమే పాదయాత్రను ముగించారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్ బయలుదేరారు. అక్రమాస్తుల కేసులో ఆయన రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరవుతారు. కాగా, ఈరోజు ఉదయం ఆయన పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామం శివారు నుంచి ప్రారంభమైంది. ఈరోజు ఆయన వెంట ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ తో పాటు ఇతర స్థానిక వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నడిచారు.