tarunbhaskar: పెద్ద హీరోల సినిమాలను డీల్ చేయలేననే విమర్శ నిజమే: తరుణ్ భాస్కర్

  • పెళ్లి చూపులు' కొత్త ట్రెండ్ సృష్టించింది 
  • తాజా చిత్రంగా 'ఈ నగరానికి ఏమైంది?'
  • ఇంకా కొంత పట్టురావాలి  

దర్శకుడు తరుణ్ భాస్కర్ పేరు వినగానే 'పెళ్లి చూపులు' సినిమా కళ్లముందు కదలాడుతుంది .. ఆ సినిమా సాధించిన సక్సెస్ గుర్తుకొస్తుంది. ఆ సినిమా కొత్త ట్రెండ్ ను సృష్టించినా .. కొంత గ్యాప్ తీసుకుని, 'ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి తరుణ్ భాస్కర్ రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలను గురించి చెప్పుకొచ్చాడు.

"పెళ్లి చూపులు' తరువాత నాకు తెలుగులోనే కాదు, హిందీ .. తమిళ చిత్రపరిశ్రమల నుంచి కూడా ఆఫర్లు వచ్చాయి. కానీ ముందుగా ఛాన్స్ ఇచ్చిన సురేశ్ ప్రొడక్షన్స్ లోనే రెండవ సినిమాను చేయాలనే ఉద్దేశంతో ఆ అవకాశాలను అందుకోలేదు. అంతేకాదు పెద్ద హీరోలతో ఛాన్స్ వచ్చింది కదా అని ఏదో ఒకటి తీయలేను .. వాళ్ల ఇమేజ్ ను డామేజ్ చేయలేను. అందుకే కొత్తవాళ్లతో ' ఈ నగరానికి ఏమైంది?' అనే సినిమా చేశాను. పెద్ద హీరోలను నేను డీల్ చేయలేను అనే విమర్శ ఇండస్ట్రీలో వుంది .. అందులో నిజం వుంది. ఎందుకంటే నాకు ఇంకా కొంత అనుభవం అవసరం. స్టార్ హీరోలను డీల్ చేయాలంటే నాకు ఇంకా పట్టురావాలని నేను అనుకుంటున్నాను" అంటూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.        

  • Loading...

More Telugu News